BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

పర్చూరు నియోజకవర్గంలో జడ్పిటిసిల జైత్రయాత్ర

Select Suryaa Now
పర్చూరు నియోజకవర్గంలో జడ్పిటిసిల జైత్రయాత్ర

పర్చూరు, మేజర్ న్యూస్:

పర్చూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నాయకత్వంలో ఆరు మండలాల్లోనూ జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని కూటమి శ్రేణులు విజయోత్సాహంలో మునిగిపోయాయి. ప్రజల నుంచి లభించిన విశేష ఆదరణతో అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయాలు సాధించారు.

మార్టూరు మండల తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి షేక్ రజాక్ 13,868 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. చిన్నగంజాం మండల టీడీపీ అభ్యర్థి నక్కల రాఘవ 8,276 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. పర్చూరు మండల కూటమి అభ్యర్థి కలవకూరి పిచ్చమ్మ 5,649 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కారంచేడు మండల టీడీపీ అభ్యర్థి పోతిన సరిత 5,716 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యద్దనపూడి మండల టీడీపీ అభ్యర్థి డక్కుమల్లి పల్లవి 5,433 ఓట్ల మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. ఇంకొల్లు మండల టీడీపీ అభ్యర్థి పూజల శ్రీనివాసరావు 4,192 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఆరు మండలాల్లోనూ జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకోవడం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు అందించిన మద్దతుగా ఈ విజయాలను పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు చేసిన సమష్టి కృషి, ఎన్నికల ప్రచారంలో చూపిన ఐక్యత విజయానికి బాటలు వేశాయని పేర్కొంటున్నారు.

విజేతలకు ఎమ్మెల్యే ఏలూరి అభినందనలు

జడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆరుగురు అభ్యర్థులతో పాటు, వివిధ మండలాల్లో గెలుపొందిన ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం కోసం కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభినందనలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి విజేతలు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.పర్చూరు నియోజకవర్గంలో కూటమికి ప్రజలు అందించిన ఈ ఘన విజయం రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.

సూర్య రిపోర్టర్: షేక్ జానీ భాష