BREAKING
నేల ఆరోగ్యాన్ని బట్టి పంటలు సాగు చేయాలి ప్రధానితో ముఖాముఖికి యువతకు అవకాశం యువత ఆలోచనలే వికసిత్ భారత్ కు పునాదులు ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, భద్రతకు పెద్దపీట వేయాలి కనకదుర్గమ్మను దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి వెండితెరపై మరోసారి విశ్వరూపం: సుదీక్ష ఎంటర్టైన్‌మెంట్ ద్వారా నవంబర్ 28న కమల్ హాసన్ 'దశావతారం' గ్రాండ్ రీ-రిలీజ్! ఉయ్యూరు కౌన్సిలర్లకు రాజేంద్రప్రసాద్ అభినందనలు జీజీహెచ్‌ సమీపంలో అగ్నికి ఆహుతైన అంబులెన్స్ దీపావళి వేడుకల్లో అప్రమత్తత అవసరం.. : పెనమలూరు సీఐ ఎన్.వెంకట నారాయణ ఎమ్మెల్యేకు ఎస్సీ డిపార్ట్మెంట్ సన్మానం ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ!

11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం..

Select Suryaa Now
 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం..

                             ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ,హైడ్రా కమిషనర్  ఏవీ రంగ‌నాథ్
మాదాపూర్‌,మేజర్ న్యూస్ : ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ, అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యే గాంధీ ,హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా చెరువును ప్రారంభించనున్న నేపథ్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ.. చెరువులోని ఆక్రమణలను తొలగించి, పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మురుగునీరు చేరకుండా చెరువు చుట్టూ యుజిడి  పైప్‌లైన్, ఎస్టీపీ  నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. చెరువు కట్ట పటిష్టత, అలుగు మరమ్మతులు, ఫెన్సింగ్, వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. తామర పూల పెంపకంతో పాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులను పరిరక్షించి సుందరీకరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.