ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన
సైబరాబాద్,మేజర్ న్యూస్ : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పార్కులను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని సీఎంసీ కమిషనర్ జి. సృజన తెలిపారు. శనివారం సీఎంసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. 770 ఖాళీ స్థలాల్లో ఇప్పటికే 300 స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించామని, మిగిలిన స్థలాలను కూడా పార్కులుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలు, వైఫై సౌకర్యం కల్పించి ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రీసైకిల్ ప్లాస్టిక్‌తో బెంచీలు, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు రీసైకిల్ నీటిని వినియోగిస్తామని తెలిపారు.
అభివృద్ధి పనుల పారదర్శకత కోసం ఖర్చులు, అధికారుల వివరాలు, ఫిర్యాదుల క్యూ ఆర్ కోడ్‌తో బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు.యునిసెఫ్ సహకారంతో ‘చైల్డ్ ఫ్రెండ్లీ సీఎంసీ’ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రణాళికలో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. నవంబర్ 20 నుంచి 23 వరకు ‘లిజనింగ్ టు చిల్డ్రన్’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు జంక్షన్ల వద్ద ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేస్తామని, కొబ్బరి బోండాల వ్యర్థాల రీసైక్లింగ్‌పైనా దృష్టి సారిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.