చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం
చిట్టమూరు మేజర్ న్యూస్
కూటమి అభ్యర్థి పెళ్లూరు సౌజన్య రెడ్డికి చిట్టమూరు మండల ప్రజలు పట్టం కట్టారు. జడ్పీటీసీ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై 1,820 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఈ విజయం నిదర్శనంగా నిలిచింది. మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆమె ప్రచారంలో పేర్కొన్నారు.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్