మహిళా భవనాల నిర్మాణానికి భూమి పూజ......
మద్దూర్ ..…మద్దూరు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామానికి మంజూరైన రెండు మహిళా సంఘం భవనాలకు శనివారం గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. అందులో భాగంగా గ్రామానికి రెండు మహిళ భవనాలు మంజూరు చేసింది అన్నారు. ఈ కార్యక్రమంలో బాజీ సర్పంచ్ మేక మల్లేశం ఉప సర్పంచ్ గొడుగు బాలరాజు, వార్డు సభ్యులు, సిఏలు యామ ఆంజనేయులు, బొంకూరి బాలమణి, వివో అధ్యక్షురాలు తవిటి సంధ్య, ఏలూరి వెంకటలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ నారదాసు శ్రీలత సిద్ధులు, అంగన్వాడీ టీచర్స్ గుడిసె అరుణ, దాసరి చంద్రకళ, కుల సంఘాల పెద్ద మనుషులు మహిళా గ్రూప్ సభ్యులు యువకులు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.