టపాసులు కాల్చడంలో జాగ్రత్తలు పాటించాలి కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి
కొండాపూర్;మండల ప్రజలందరూ దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్సై సోమేశ్వరి ఆకాంక్షించారు. పండుగ పేరుతో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, శిబిరాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. టపాసులు, బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, చిన్నపిల్లల విషయంలో పెద్దలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా పండుగ జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై సోమేశ్వరి తెలిపారు.