సామాజిక సేవలో భాగస్వాములు కావాలి :డాక్టర్ కేవీ రమణాచారి
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ :సామాజిక సేవలో భాగస్వాములు కావాలని, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసి చేతులు మిన్న అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. శనివారం భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్, వివేకానంద ప్రతిభ జ్యోతి ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పలువురికి విద్య వికాస్ స్కాలర్షిప్ లను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు. అనంతరం తండ్రి లేని పేద విద్యార్థులకు రూ.5వేల రూపాయల నగదు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనబరిచిన 175 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందజేశారు. పలువురు వికలాంగులకు కృత్రిమ అవయవాలను అందించారు. కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి చైర్మన్ సిహెచ్ హనుమంతరావు, పతంజలి యోగ పీఠం తెలంగాణ అధ్యక్షుడు శ్రీధర్ రావు, అశ్విని సంస్థల ట్రస్ట్ చైర్మన్ అశ్విని సుబ్బారావు, సాధన నరసింహచారి, నరేంద్ర కృష్ణ, సుజన ప్రభ తదితరులు పాల్గొన్నారు.