BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు !!హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్!!

Select Suryaa Now
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు !!హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్!!

న్యాల్కల్;న్యాల్కల్ మండల కేంద్రంలో శనివారం హద్నూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ సుజిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా న్యాల్కల్ మండల ప్రజలకు పేకాటకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా పేకాట ఆడినా, నిర్వహించినా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో పేకాట నిర్వహించేందుకు స్థలం ఇచ్చిన యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పేకాట వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, అప్పులపాలై కుటుంబాల్లో గొడవలు, ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొందరు జూదం, మద్యానికి బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రజలు పేకాటకు దూరంగా ఉండి దీపావళి పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఎస్ ఐ సుజిత్ తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ సుజిత్ భరోసా ఇచ్చారు. అలాగే న్యాల్కల్ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.