అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిన శంకరాపురం
అయ్యప్ప నామ స్మరణ తో మారు మ్రోగిన శంకరాపురం.
సూర్య న్యూస్ ముండ్లమూరు. మండలంలోని శంకరాపురం గ్రామంలో అయ్యప్ప నామ స్మరణతో మారుమొగింది. ఆ గ్రామంలో అయ్యప్ప స్వామి పడి భజన కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి చెందిన మందలపు శ్రీనివాసరావు సుమతీ దంపతుల కుమారులు లక్ష్మీ గౌతమ్, వెంకట సాకేత్ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి పడి భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని అయ్యప్ప శివ స్వాముల తో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన స్వాములు పడి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. గురు స్వాములు మేడికొండ శంకర్ స్వామి గూడూరు వెంకటరావు స్వామి గిరిధర్ శర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పడిభజన పలువురిని ఆకట్టుకుంది. భజన వచ్చిన స్వాములకు తీర్థప్రసాదాలను అందజేశారు.