BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

అంబర్ పేట్, మేజర్ న్యూస్  : దీపావళి పండుగను పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను పీసీసీ ప్రధాన కార్యదర్శి నాగభూషణం, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్, దిలీప్ కుమార్ నేత తదితర కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ మాట్లాడుతూ.. దీపావళి పండుగ చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలో ప్రేమ, ఐక్యత మరింత బలపడాలని, ప్రతి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 
దీపావళి పండుగ ప్రజల మధ్య పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించే పండుగ అని, ఇటువంటి పండుగలు సామాజిక ఐక్యతకు దోహద పడతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు .