కలిమెర సర్పంచ్ తోటకూరి జలజ యాదయ్య చొరవ.. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ద్వారా రూ.51 వేల ఆర్థిక సాయం!
కట్టంగూర్ మండల పరిధిలోని కలిమెర గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కత్తుల సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రోజూ కూలీనాళీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే సురేష్ అకాల మరణంతో అతడి కుటుంబం రోడ్డున పడింది. ఈ దుఃఖ సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కలిమెర గ్రామ సర్పంచి తోటకూరి జలజ యాదయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాధిత కుటుంబం పరిస్థితిని గమనించిన సర్పంచ్ జలజ యాదయ్య వెంటనే స్పందించి, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సర్పంచ్ చేసిన ఈ విశేష కృషికి స్పందించిన ఎమ్మెల్యే వేముల వీరేశం వెంటనే సానుకూలంగా స్పందించి, ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు. దీంతో మాజీ జెడ్పీటీసీ మాద యాదగిరి, కట్టంగూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకరబోయిన వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పెద్ద సుక్కయ్య గౌడ్ తదితరులు కలిమేర గ్రామానికి వెళ్లి కత్తుల సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.51 వేల ఆర్థిక సాయాన్ని అందజేసి, వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా నాయకుల తరఫున ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. బాధ లో ఉన్న పేద కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి సర్పంచ్ తోటకూరి జలజ యాదయ్య చూపిన చొరవను, నాయకులను సమన్వయం చేసిన తీరును గ్రామస్తులు, పార్టీ శ్రేణులు ఎంతో అభినందిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ రెఫరెండం సర్పంచ్ గద్దపాటి దానయ్య, మాజీ ఉప సర్పంచ్ తండు గిరిబాబు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.