మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలంలో గత 5న జరిగిన ఎన్నికలలో భాగంగా భట్టిప్రోలు మండలంలో 14 సెగ్మెంట్లకు గాను 14 తెలుగుదేశం, మిత్ర పక్ష మైన జనసేన పార్టీలు కైవసం చేసుకున్నాయి. కూటమి బలపరిచిన, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీపీ అభ్యర్థి భట్టిప్రోలు 3వ సెగ్మెంట్ అభ్యర్థి కుమారి గాత్రం సౌమ్యశ్రీ తన సమీప ప్రత్యర్థి, వైసిపి పార్టీకి చెందిన కౌతరపు పద్మావతి పై 1033 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు. భట్టిప్రోలు 1వ సెగ్మెంట్ లో కత్తి కృష్ణ 870 ఓట్ల ఆదిక్యంతో వైసిపి అభ్యర్థి కట్టా నాగరాజు పై విజయం సాధించారు. భట్టిప్రోలు రెండవ సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి మండ్రు సునీల్ బాబు తన సమీప ప్రత్యర్థి వైయస్సార్ పార్టీ కి చెందిన లింగం శ్రీనివాసరావు పై 597 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. భట్టిప్రోలు 4వ సెగ్మెంట్ కు చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కటకం కుమారస్వామి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీకి చెందిన కౌతరపు విజయలక్ష్మిపై 960 ఓట్ల.మెజార్టీతో విజయం సాధించారు. వెల్లటూరు ఒకటవ సెగ్మెంట్లో తెలుగుదేశం అభ్యర్థిని జంపని వర్దని తన సమీప ప్రత్యర్థి పై 1020 ఓట్ల ఆదిక్యంతో మెజారిటీ సాధించారు. వెల్లటూరు రెండవ సెగ్మెంట్లో తెలుగుదేశం అభ్యర్థి డొక్కా రామస్వామి తన సమీప వైయస్సార్సీపీకి చెందిన అభ్యర్థిపై 611 కోట్ల ఆదిక్యం సాధించారు. ఐలవరం ప్రాదేశిక నియోజకవర్గం లో గాత్రం బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సిపికి చెందిన అభ్యర్థిపై 411 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఓలేరు సెగ్మెంట్లో తెలుగుదేశం అభ్యర్థి, సమీప ప్రత్యర్థి పై 912 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు. కోనేటి పురం గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి జల్లి రత్నకుమారి తన సమీప వైసీపీకి చెందిన అభ్యర్థి కర్ర లక్ష్మీ ప్రసన్న పై 916 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించారు. గొరిగపూడి గ్రామంలో జనసేన పార్టీకి చెందిన అభ్యర్థి సమీప వైసీపీకి చెందిన అభ్యర్థిపై 1155 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. చింతమోటు సెగ్మెంట్ నుండి తెలుగుదేశం అభ్యర్థి ముమ్మనేని వాసవి తన సమీప ప్రత్యర్థి పై 930 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. పెద పులివరు సెగ్మెంట్లో తెలుగుదేశం అభ్యర్థి బుస్సా విజయలక్ష్మి తన సమీప వైసీపీకి చెందిన అభ్యర్థిపై 180 ఓట్ల ఆదిక్య యంతో విజయం సాధించారు. సూరేపల్లి సెగ్మెంట్లో తెలుగుదేశం అభ్యర్థి , వైసిపి అభ్యర్థి పై 234 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పల్లి కోన సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన వేములపల్లి రఘునాథ్ తన సమీప వైఎస్ఆర్సిపికి చెందిన అభ్యర్థి నూతక్కి జస్వంత్ రాజు పై చివర రౌండ్ లెక్కింపునకు ముందు 600 మెజార్టీతో ఉన్నారు. ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి వెలువరించవలసి ఉన్నది.