BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

రోడ్డు పునర్నిర్మాణం కోసం బిజెపి ఆందోళనకు సిద్ధం

Select Suryaa Now
రోడ్డు పునర్నిర్మాణం కోసం బిజెపి ఆందోళనకు సిద్ధం

 

  జిన్నారం:పెద్ద కంజర్ల నుంచి శివానగర్ వరకు అధ్వానంగా మారిన రోడ్డును వెంటనే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ మంగళవారం పెద్ద కంజర్ల చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఈ మేరకు జిన్నారం మున్సిపాలిటీ బీజేపీ నాయకుల సమావేశం మండల అధ్యక్షుడు కే. జగన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాపరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న స్థానిక సమస్యలపై నాయకులు చర్చించారు. ముఖ్యంగా పెద్ద కంజర్ల నుంచి శివానగర్ వరకు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సమావేశంలో ప్రస్తావించారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు పునర్నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు సమస్యపై చేపట్టనున్న ధర్నాకు మున్సిపాలిటీ పరిధిలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా నాయకుడు రాజిరెడ్డి, కౌన్సిలర్లు స్వప్న, రాజేందర్ రెడ్డి, వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, పూడూరు సుధాకర్, మహేష్ యాదవ్, వినయ్ కుమార్, దుబ్బ శ్రీనివాస్, గంగు లక్ష్మణ్, సీహెచ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.