చెరువులు కబ్జాలను తొలగించి అభివృద్ధి పనులు :కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్
హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పునరద్దరణ
సిఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం
అల్లాపూర్, మేజర్‌న్యూస్ :కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని సున్నం చెరువు అభివృద్ధి పనులను టిపిసిసి ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ గాయత్రి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి పరిశీలించారు. ఈ చెరువును కబ్జాదారులు సగానికి పైగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. వాటిని తొలగించి చెరువును రాష్ట్ర ప్రభుత్వం సర్వాంగ సుందరంగా హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
ఈ చెరువు పునరుద్ధరణ పనులు పూర్తయిన వెంటనే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ సున్నం చెరువు అభివృద్ధి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. వాకింగ్ ట్రాక్ సెక్యూరిటీ గ్రీనరీ తదితర అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల్లో కబ్జాలను తొలగించి వాటిని పునరుద్ధరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందన్నారు. ఇకపై హైదరాబాద్ చెరువుల్లో కబ్జాలు చేసే పరిస్థితి ఉండదన్నారు.
అదేవిధంగా గాయత్రి నగర్ నుంచి వంద ఫీట్ల రోడ్డుకు కనెక్టివిటీ రోడ్డును ఏర్పాటు చేయాలన్న స్థానికుల కోరికను మన్నించి స్థానిక రహదారిని అభివృద్ధి చేస్తామన్నారు. పుష్పారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, అల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ వాజిద్ పాషా, ఫతే నగర్ డివిజన్ ప్రెసిడెంట్ క్రాంతి, ఉమ్మడి అల్లాపూర్ మహిళా ప్రెసిడెంట్ భారతమ్మ, గాయత్రి నగర్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ మహేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల సత్యం, లక్ష్మణ్ గౌడ్, కనకయ్య, నరసింహ యాదవ్, నాగిరెడ్డి, ఆది రెడ్డి, రవీందర్ ముదిరాజ్, ఆదినారాయణ, రంగమోహన్, చల్లయ్య, గోపాల్ రెడ్డి, రాజేశ్వర చారి, ప్రకాష్ ముదిరాజ్, భర్కత్ అలీ, సతీష్ రెడ్డి, సత్య నారాయణ, ధర్మారావు, శర్మ, నజీర్ అడ్డు ,రవి పిడికిటి గోపాల్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.