BREAKING
చెరువులు కబ్జాలను తొలగించి అభివృద్ధి పనులు :కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు !!హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్!! ఓల్డ్ మల్కాజిగిరి‌లో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన పంచాయతీలకు నేరుగా నిధులు ప్రభుత్వ నిర్ణయానన్ని స్వాగతిస్తూన్న సర్పంచుల జె ఏ సి జిల్లా అధ్యక్షులు శివన్న గూడెం సర్పంచ్ వినోద్ నాయక్ పీఏసీఎస్ పాలకవర్గాలు సమన్వయంతో ముందుకు సాగి రైతుల శ్రేయస్సుకు పాటుపడాలి సామాజిక సేవలో భాగస్వాములు కావాలి :డాక్టర్ కేవీ రమణాచారి టపాసులు కాల్చడంలో జాగ్రత్తలు పాటించాలి కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ లలితా శ్రావణి దశాబ్ద కాలం నాటి పేదల సొంతింటి కలను ప్రజా పాలన ప్రభుత్వంలో సాకారం చేస్తున్నాం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు కలిమెర సర్పంచ్ తోటకూరి జలజ యాదయ్య చొరవ.. మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ద్వారా రూ.51 వేల ఆర్థిక సాయం! జల్సాలకు అలవాటుపడి దొంగలుగా మారి.. కటకటాలపాలు! మహిళా భవనాల నిర్మాణానికి భూమి పూజ...... పర్చూరు నియోజకవర్గంలో జడ్పిటిసిల జైత్రయాత్ర టపాసులు పేల్చేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు

త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే

Select Suryaa Now
త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్  పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్   పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే

త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్

పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్

పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు, ఎలాంటి బిల్లు లేకుండా విక్రయిస్తున్నారని పలువురు వినియోగదారులు వాపోతున్నారు.
త్రికోటేశ్వర క్రాకర్స్ యాజమాన్యం కొందరు విలేకరుల పేరును అడ్డం పెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని, తమకు పెద్దల అండదండలు ఉన్నాయని చెబుతున్నారని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. దీంతో సామాన్య ప్రజలు నోరు మెదపలేకపోతున్నారని అంటున్నారు.
ఇదే విషయంపై స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బాణాసంచా షాపుల్లో రేట్ల పట్టిక పెట్టాలని, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే లైసెన్స్ నిబంధనలు, అగ్ని ప్రమాద నివారణ చర్యలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేయాలని కోరుతున్నారు.
ఈ ఆరోపణలపై త్రికోటేశ్వర క్రాకర్స్ యాజమాన్యం స్పందన కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. యాజమాన్యం స్పందిస్తే వారి వివరణను కూడా ప్రచురిస్తాము.
అధికారులు వెంటనే స్పందించి, పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని బాణాసంచా షాపులను తనిఖీ చేసి, అధిక రేట్లకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.