BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

దశాబ్ద కాలం నాటి పేదల సొంతింటి కలను ప్రజా పాలన ప్రభుత్వంలో సాకారం చేస్తున్నాం

Select Suryaa Now
దశాబ్ద కాలం నాటి పేదల సొంతింటి కలను ప్రజా పాలన ప్రభుత్వంలో సాకారం చేస్తున్నాం

హుస్నాబాద్ ; దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం సాకారం చేస్తోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.హుస్నాబాద్ పట్టణంలోని 12వ వార్డులో పొన్నం కోమల - సమ్మయ్య ముదిరాజ్ దంపతులకు ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై, నిర్మాణం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులైన కోమల - సమ్మయ్య దంపతులకు నూతన వస్త్రాలు అందించి, స్వీట్లు తినిపించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఇందిరమ్మ ఇంట్లో కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బాణసంచా కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..- దశాబ్ద కాలంగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదల కలను ప్రజా పాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సాకారం చేస్తోంది.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేద కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.- ఈ దీపావళి పండుగను తమ సొంత ఇందిరమ్మ ఇళ్లలో జరుపుకుంటున్న లబ్ధిదారులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.- హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 2,500కు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లలో ఈరోజు దీపావళి సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది.
- 500 గుడిసెల స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. మధ్యలో నిలిచిపోయిన మరో 500 ఇళ్లకు, రెండో దశలో అదనంగా 1,000 ఇళ్లకు మంజూరులు లభించాయి.
- ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం.
- రెండో దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారం, పది రోజుల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించే ప్రక్రియను పూర్తి చేస్తాం.
- రూఫ్ లెవల్‌లో ఉన్న లబ్ధిదారులు కూడా త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, మున్సిపాలిటీలో పూర్తయిన ప్రతి ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిస్తున్నాను.
- రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరూ తమ సొంతింట్లో దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలి.- పదేళ్ల నిరీక్షణ తర్వాత సొంతింటి కల నెరవేరి, ఈరోజు నా అక్కాచెల్లెళ్లు ప్రజా పాలన ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.