జల్సాలకు అలవాటుపడి దొంగలుగా మారి.. కటకటాలపాలు!
రామచంద్రపురం;జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.3 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ టీమ్ ప్రత్యేక నిఘాతో ఈ దొంగల ముఠా గుట్టురట్టయింది.రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఒకే కాలనీకి చెందిన ముగ్గురు నిందితులు హ్యాండిల్ లాక్ వేయకుండా పార్క్ చేసిన బైక్‌లను లక్ష్యంగా చేసుకునేవారు. మరో ద్విచక్ర వాహనం సాయంతో టోయింగ్ చేస్తూ వాటిని చోరీ చేసేవారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతాల్లో దాచిపెట్టి విక్రయించేందుకు ప్రయత్నించేవారు. ఇలా మొత్తం ఆరు బైక్‌లను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చెడు అలవాట్లు, విలాసవంతమైన జీవనశైలికి అవసరమైన డబ్బు కోసం ఈ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.స్వాధీనం చేసుకున్న వాహనాలు రామచంద్రపురం, పటాన్‌చెరు, సంగారెడ్డి రూరల్, రాజేంద్రనగర్, ఆర్జీఐ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన చోరీ కేసులకు సంబంధించినవిగా గుర్తించారు.శనివారం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.ఏసీపీ సీహెచ్.వై. శ్రీనివాస్ కుమార్ పర్యవేక్షణలో రామచంద్రపురం ఇన్‌స్పెక్టర్ జి. లాలూ నాయక్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ జె.శ్రీకర్ బాబు ఆధ్వర్యంలో క్రైమ్ టీమ్ ఈ కేసును ఛేదించింది.