BREAKING
130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపిన పూజిత గౌడ్ ,జగదీశ్వర్ గౌడ్ 11 న సీఎం చేతుల మీదుగా తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం.. ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ: క్వార్టర్స్‌లో పోరాడి ఓడిన మాయ రాజేశ్వరన్ ఆధునిక సౌకర్యాలతో పార్కుల అభివృద్ధి..... ‘వర్క్ ఫ్రమ్ పార్క్’కు శ్రీకారం.. సీఎంసీ కమిషనర్ జి. సృజన

టపాసులు పేల్చేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు

Select Suryaa Now
టపాసులు పేల్చేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు

 

సీఐ వెంకటేశ్వర్లు 

ఆమనగల్లు రంగారెడ్డి:

దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు టపాసులు పేల్చే సమయంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ సంద వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ టపాసులు విక్రయించే వ్యాపారులు తమ దుకాణాలకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకొని, దుకాణంలో పెద్ద మొత్తంలో స్టాక్ నిలువలు ఉంచొద్దని ఆయన పేర్కొన్నారు. గృహాల మధ్య భారీ శబ్దాలనిచ్చే టపాసులను కాల్చి ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఆయన వివరించారు. ప్రధాన రహదారులపై ప్రజలు ఇష్టానుసారంగా టపాసులు కాల్చి వాహనదారులు, పాదాచారులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. 

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.