ఆళ్లగడ్డలో తెదేపా ప్రభంజనం
ఆళ్లగడ్డలో టీడీపీ ప్రభంజనం…
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్; ఆళ్లగడ్డ నియోజకవర్గం లో తెదేపా ఘనవిజయం సాధించడంపై కార్యకర్తల నాయకుల మనోగతం ఇలా ఉంది.ఆరు మండలాలు… ఆరు జడ్పీటీసీలు… ఆరు ఎంపీపీలు… అన్నీ పసుపు జెండా కైవసం చేసుకుంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే కాదు… ఆళ్లగడ్డ రాజకీయ చరిత్రలోనే ఇదొక సరికొత్త రికార్డు!ఏకగ్రీవాలతో కాదు… ప్రత్యర్థులతో నేరుగా తలపడి, ప్రజాక్షేత్రంలో పోటీ చేసి, ప్రజల మద్దతుతో విజయాలు సాధించిన ఘనత ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీదే!ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఆరు జడ్పీటీసీ స్థానాలు, ఆరు ఎంపీపీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది.మొత్తం 71 ఎంపీటీసీ స్థానాలకు గాను 47 స్థానాల్లో విజయం సాధించి, 70 శాతానికి పైగా స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.ప్రత్యర్థులకు గట్టి సమాధానం చెబుతూ జడ్పీటీసీ స్థానాల్లో 10 వేలకుపైగా మెజారిటీలతో విజయదుందుభి మోగించింది.ఇక్కడ గెలిచింది కేవలం అభ్యర్థులు మాత్రమే కాదు… ఆళ్లగడ్డలో టీడీపీపై ప్రజలకు ఉన్న నమ్మకం.రాష్ట్రంలోనే తొలి మున్సిపాలిటీల్లో ఒకటిగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీని కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సైతం కైవసం చేసుకుని పట్టణ రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.బనగానపల్లెలో ఏకగ్రీవాల ద్వారా స్థానాలు దక్కించుకుంటే… ఆళ్లగడ్డలో మాత్రం అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమై, ప్రత్యర్థులను ఎదుర్కొని, ప్రజల తీర్పుతో విజయాలు సాధించడం టీడీపీ ప్రత్యేకత.ఆరు మండలాలు… ఆరు జడ్పీటీసీలు… ఆరు ఎంపీపీలు… 47 ఎంపీటీసీలు… మున్సిపాలిటీపై పసుపు జెండా!ఇది సాధారణ విజయం కాదు… ఆళ్లగడ్డలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు!ఈ విజయంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది.ప్రత్యర్థులకు రాజకీయంగా గట్టి సమాధానం… ఆళ్లగడ్డ ప్రజల తీర్పుతో టీడీపీకి తిరుగులేని ఆధిక్యం!ఆళ్లగడ్డలో పసుపు ప్రభంజనం ఆగలేదు… ప్రజల మద్దతుతో మరింత బలంగా ముందుకు సాగుతోంది!
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా