BREAKING
కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి! కనిగిరి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి విజయం

క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నరోత్తమ రెడ్డి

Select Suryaa Now
క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నరోత్తమ రెడ్డి

                                           భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవం

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదని, అది వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు సేవా భావాన్ని పెంపొందించే గొప్ప ఉద్యమమని ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు నరోత్తమ రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ సర్దార్ పటేల్ రోడ్డు లోని భారత్ స్కౌట్స్ & గైడ్స్ జిల్లా కార్యాలయంలో భారత్ స్కౌట్స్ & గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా లార్డ్ బేడెన్ పావెల్ లేడీ బేడెన్ పావెల్ ల చిత్రపటాలకు పుష్ప మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కౌట్ గైడ్ విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.

 భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 71 ఏళ్ల వయసులో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యుల క్రమశిక్షణ తనకు స్ఫూర్తినిచ్చిందని, ఇకపై తాను కూడా ఆ నిబద్ధతను కొనసాగిస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సంస్థ విస్తరణకు, సేవా విలువల వ్యాప్తికి అంకితభావంతో శ్రమిస్తున్న జిల్లా నాయకత్వాన్ని, దేవదత్ వారి బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ మరియు ఎగ్జిబిషన్ సొసైటీ పరిధిలోని కళాశాలలు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌తో కలిసి పనిచేసేలా ప్రోత్సహిస్తామని, సంస్థకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డాక్టర్ వంశ తిలక్ మాట్లాడుతూ.... 
క్రమశిక్షణ, సన్నద్ధతే విజయ రహస్యాలు అని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేర్పే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శాంతి, సేవాభావం మరియు సోదరభావం ప్రతి పౌరుడికి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. సంస్థ వ్యవస్థాపకులు లార్డ్ బాడెన్ పావెల్, లేడీ బాడెన్ పావెల్ ఆదర్శాలను స్మరించుకుంటూ, వారి సిద్ధాంతాలు వ్యక్తిత్వ వికాసానికి పునాది అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా మంత్రి, డిప్యూటీ స్పీకర్ దివంగత టి.ఎన్. సదాలక్ష్మి స్మరిస్తూ, బడుగు వర్గాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆమె ప్రస్థానం నేటి విద్యార్థినులకు ఆదర్శమని అన్నారు. బాలికలు లక్ష్యాలను నిర్దేశించుకుని కలలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతే దేశ భవిష్యత్తు అని, వారిని జనరేషన్ ఎఫ్, ఫ్యూచర్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తూ, దేశ రక్షణ మరియు ప్రగతిలో విద్యార్థులదే కీలక పాత్ర అని విశ్వాసం వ్యక్తం చేశారు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును స్వీకరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
అనంతరం డిస్ట్రిక్ట్ చీఫ్ కమిషనర్ కె.వి దేవదత్ మాట్లాడుతూ.... కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా దేశ యువతలో క్యారెక్టర్ బిల్డింగ్, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సదా సిద్ధం అనే సేవా భావాన్ని పెంపొందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం అన్నారు. భారతదేశంలో స్కౌటింగ్, గైడింగ్ ఉద్యమం ఒకే గొడుగు కిందకు చేరిన చారిత్రక ఘట్టానికి ఈ రోజు ప్రతీక అంటూ లార్డ్ బాడెన్ పోవెల్ 1907లో ఇంగ్లాండ్‌లో స్కౌటింగ్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1909లో భారత్‌లో స్కౌటింగ్ మొదలైనప్పటికీ, ప్రారంభంలో ఇది కేవలం బ్రిటిష్ మరియు ఆంగ్లో-ఇండియన్ పిల్లలకు మాత్రమే పరిమితమై ఉండేదని, భారతీయులకు ఇందులో ప్రవేశం ఉండేది కాదని గుర్తు చేశారు. ఈ వివక్షను వ్యతిరేకిస్తూ భారత జాతీయ నాయకులు భారతీయుల కోసం స్వతంత్రంగా స్కౌట్ సంస్థలను స్థాపించారని, 1916 డాక్టర్ అన్నీ బెసెంట్ నేతృత్వంలో ఇండియన్ బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్, 1918 పండిట్ మదన్ మోహన్ మాలవ్య, పండిట్ హృదయనాథ్ కుంజ్రూల సహకారంతో సేవా సమితి స్కౌట్ అసోసియేషన్ ఇలా స్వాతంత్ర్యానికి ముందు దేశంలో అనేక విభిన్న స్కౌట్, గైడ్ గ్రూపులు స్వతంత్రంగా పనిచేసేవి అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, దేశంలోని యువతను క్రమశిక్షణ, సేవ మరియు దేశభక్తి వైపు నడిపించడానికి ఈ వేర్వేరు సంస్థలన్నింటినీ ఒకే జాతీయ వేదిక కిందకు తేవాలని
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, మరియు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నాయకులు అన్ని స్కౌట్ విభాగాలను ఏకం చేయడానికి తీవ్రంగా కృషి చేశారని సుదీర్ఘ చర్చలు, సమన్వయం అనంతరం 1950 నవంబర్ 7న దేశంలోని ప్రధాన స్కౌట్ సంస్థలన్నీ అధికారికంగా విలీనమై "ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్" ఏర్పడిందని వివరించారు. ఆ తర్వాత కొద్ది నెలలకే, 1951 ఆగస్టు 15న ఆల్ ఇండియా గర్ల్ గైడ్స్ అసోసియేషన్ కూడా ఇందులో చేరడంతో బాలురు, బాలికల విభాగాల సమగ్ర జాతీయ సంస్థగా బి ఎస్ జి గా పరిపూర్ణత సాధించిందని సంస్థ యొక్క చరిత్రను గుర్తు చేశారు. 
నవంబర్ 7ను దేశవ్యాప్తంగా "భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఫౌండేషన్ మరియు ఫ్లాగ్ డే"గా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్కౌట్స్ మరియు గైడ్స్ ప్రత్యేక స్టిక్కర్లను పంపిణీ చేసి నిధులు సేకరించారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ పరమేశ్వర్, జిల్లా కార్యదర్శి రమేష్ చందర్, కోశాధికారి రాజశేఖర్ రెడ్డి, కమిషనర్లు విష్ణు ప్రసాద్, విజయ భాస్కర్, గౌరీనాథ్, ఇందుమతి, సంగీత పాండే, స్కౌట్ మాస్టర్లు, గైడ్ కెప్టెన్లు, రోవర్స్, రేంజర్స్, వివిధ పాఠశాలల స్కౌట్స్, గైడ్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు