BREAKING
రామాయణం గొప్పతనాన్ని పక్కన పెట్టి బడ్జెట్ గురించా చర్చ?: సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు బీసీ ఆత్మగౌరవ భవనాలు.. రాజకీయ చైతన్య కేంద్రాలుగా మారాలి : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య వెన్నెముక శస్త్రచికిత్సలో ఆధునిక సాంకేతికతపై జాతీయ సదస్సు ఓటీటీలో అలరించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ 'హైకు': నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే? స్ట్రీమ్ డెంటల్ కేర్ ప్రారంభం క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ - నరోత్తమ రెడ్డి ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దు చేయాలి :బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హాలీవుడ్ సినిమాలకంటే బాగుంది: 'రామాయణం'పై సన్నీ డియోల్ ప్రశంసల జల్లు బీజేపీలో చేరిన ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ పూజారి, అమేయ పూజారి మెదక్ పట్టణ అభివృద్ధికి రూ.9.11 కోట్లతో భారీ నిధులు రోడ్డు పునర్నిర్మాణం కోసం బిజెపి ఆందోళనకు సిద్ధం చెరువులు కబ్జాలను తొలగించి అభివృద్ధి పనులు :కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు !!హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్!! ఓల్డ్ మల్కాజిగిరి‌లో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ పర్యటన పంచాయతీలకు నేరుగా నిధులు ప్రభుత్వ నిర్ణయానన్ని స్వాగతిస్తూన్న సర్పంచుల జె ఏ సి జిల్లా అధ్యక్షులు శివన్న గూడెం సర్పంచ్ వినోద్ నాయక్

ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్

Select Suryaa Now
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్

కోహెడ ; దీపావళి పండుగను పురస్కరించుకుని కోహెడ ఎస్సై అభిలాష్ మండల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ వేళ ప్రజలు ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అవగాహన సూచనలు జారీ చేశారు.దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారని తెలిపారు. ఉచిత బహుమతులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, నకిలీ లింకులు, అనుమానాస్పద మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు లావాదేవీల వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని పేర్కొన్నారు.సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా, ప్రశాంతంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఎస్సై అభిలాష్ కోరారు.