వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం
వెలిమెల;వెలిమెల తండాలో బోరు పనిచేయక తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శాపురం నర్సింహారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన అధికారులు బోరుకు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గ్రామస్తులకు తాగునీటి సమస్య తీరింది. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని నర్సింహారెడ్డి తెలిపారు.