BREAKING
హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి హెట్రో పరిశ్రమ సహకారంతో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం లో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు… జగన్ హయాంలో ఎన్నికల్లో హింస.. ఇప్పుడు సిరాచుక్కలతో స్వేచ్ఛగా ఓటింగ్: ప్రత్తిపాటి పుల్లారావు టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయనున్న టెస్లా

కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు

Select Suryaa Now
కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు  ట్రాఫిక్ మళ్లింపు

ఉదయగిరి,మేజర్ న్యూస్ :   ఉదయగిరి మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో శనివారం నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఉదయగిరి సర్కిల్ ఎన్నికల ఇన్చార్జి డీఎస్పీ వేమారెడ్డి, ఉదయగిరి సీఐ అంకమరావు లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎం పీటీసీ స్థానానికి సంబంధించి అభ్యర్థితోపాటు ఇద్దరు, జడ్పీటీసీ స్థానానికి సంబంధించి అభ్యర్థితోపాటు ఐదు మందిని అనుమతించడం జరుగుతుందన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు కళాశాలకు పడమటి వైపునున్న గేటు ద్వారా లోనికి రావాలన్నారు. వాహనాలను గేటు బయటే ఫార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ఒక డీఎస్పీతో ముగ్గురు సీఐలు, 13 ఎస్ఐలు, 120 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని వారు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపు : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందన్నారు.  ఉదయగిరి-సీతారామపురం పాత రహదారి మార్గంలో కౌంటింగ్ వచ్చే అభ్యర్థులు, ఉద్యోగులు, ఏజంట్లకు మినహా మిగిలిన వారికి ప్రవేశం ఉండదన్నారు. సీతారామపురం వెళ్లేవార అక్కడ నుంచి ఉదయగిరికి వచ్చేవారు 167-బీజీ జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గుర్తించి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సుభాషిణి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.