andhrapradesh
ఆటోనమస్ పరీక్షల్లో ఈశ్వర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
నరసరావుపేట న్యూస్ : స్థానిక కేసానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు బీటెక్ మొదటి, రెండో సెమిస్టర్ ఆటోనమస్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన విద్యార్థులు కళాశాల టాపర్లుగా నిలిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ విభాగంలో నల్లగొండ లక్ష్మీ తిరుపతమ్మ 84 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో షేక్ ఇర్ఫానా 84 శాతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో అన్నలదేవి స్వప్న 86 శాతం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో షేక్ సమీనా బేగం 85 శాతం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో షేక్ వైద్యుడు జిలాని 82 శాతం, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో జె. కీర్తన 81 శాతం మార్కులతో ప్రథమ స్థానాల్లో నిలిచారు. విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నాగమల్లేశ్వ రరావు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అధ్యాపకులు నిరంతరం కృషి చేస్తున్నారని, విద్యతోపాటు నైపుణ్యాలను పెంపొందిం చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ షేక్ కరీమ్ మొహిద్దీన్ సూచించారు. విద్యార్థుల విజయమే కళాశాల లక్ష్యమని, నాణ్యమైన విద్యను అందించేందుకు యాజమాన్యం కట్టుబడి ఉందని మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ పేర్కొన్నారు. విద్యార్థులు సాధించిన ఫలితాలు వారి భవిష్యత్తుకు పునాదిగా నిలవాలని, రానున్న పరీక్షల్లో మరింత మెరుగైన ప్రతిభ కనబరచాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేక్ నజీమా ఆకాంక్షించారు. టాపర్లకు మెరిట్ స్కాలర్‌షిప్: అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల చైర్మన్ షేక్ మీరావలి అభినందించారు. మొదటి సంవత్సరం చదువుతూ రెండు సెమిస్టర్లలోనూ కళాశాల టాపర్‌గా నిలిచే విద్యార్థులకు షేక్ దాదా సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెరిట్ స్కాలర్‌షిప్ అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థులు రానున్న సెమిస్టర్లలోనూ మరింత పట్టుదలతో చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం ఆకాంక్షించారు.