BREAKING
ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం

మోహన్ బాబు వర్సిటీలో రొమ్ము క్యాన్సర్ అవగాహన సదస్సు విజయవంతం

Select Suryaa Now
మోహన్ బాబు వర్సిటీలో రొమ్ము క్యాన్సర్ అవగాహన సదస్సు విజయవంతం

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

మోహన్ బాబు వర్సిటీలో రొమ్ము క్యాన్సర్ అవగాహన సదస్సు విజయవంతం

​మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో "ఎర్లీ డిటెక్షన్, ఇన్నోవేటివ్ డయాగ్నాస్టిక్, ఉమెన్స్ ఎంపావర్మెంట్" అంశంపై మూడు రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం ముగిసింది. ఎంబీ స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లోని, ప్రార్మసీ ప్రాక్టీస్ విభాగం, బయోటెక్నాలజీ విభాగం సంయుక్తంగా దాసరి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సుకు 500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వేమారెడ్డి హేమలత మాట్లాడుతూ.. రొమ్ము స్వయం పరీక్ష  నిర్వహించే విధానం, గడ్డలు, పరిమాణ మార్పులు, చనుమొనలు లేదా చర్మంపై వచ్చే అసాధారణ లక్షణాలను గుర్తించే పద్ధతులను ప్రదర్శన ద్వారా వివరించారు. అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా క్యాన్సర్‌ను తొలి దశలోనే నయం చేసుకోవచ్చని తెలిపారు. మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివి రమణ, రిజిస్ట్రార్ సారథి, ఫార్మాస్యూటికల్ డీన్ జయప్రకాష్ 
పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు వెల్లడించారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి