BREAKING
మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి

Select Suryaa Now
న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి

పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -
పాలమూరు యూనివర్సిటీలో IQAC ఆధ్వర్యంలో NAAC–AQAR నివేదికల తయారీపై లైబ్రరీ ఆడిటోరియం లో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, యూనివర్సిటీ NAAC గ్రేడ్‌ను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా అధ్యాపకులు, విభాగాధిపతులు, అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సమష్టిగా పనిచేయాలని సూచించారు. బోధన, పరిశోధన, విద్యార్థుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో నాణ్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్ బాబు మాట్లాడుతూ, NAACకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి ఆధారాలతో నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు.అన్ని క్రైటీరియా కోఆర్డినేటర్లు, విభాగాధిపతులు సమన్వయంతో పనిచేస్తూ AQAR నివేదికల రూపకల్పనలో చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు.OSD to Vice-Chancellor ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, NAAC గ్రేడ్ పెంపునకు ప్రతి విభాగం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని, యూనివర్సిటీలో చేపట్టిన విద్యా, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సరైన ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. 
IQAC డైరెక్టర్ డా. రాజ్ కుమార్ మాట్లాడుతూ, 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించిన AQAR నివేదికల తయారీకి అవసరమైన సమాచారాన్ని ఏడు ప్రమాణాల వారీగా సేకరించి, తగిన ఆధార పత్రాలతో సమర్పించాలని సూచించారు.ఈ సమావేశంలో క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, క్రైటీరియా కోఆర్డినేటర్లు, పీజీ కేంద్రాల బాధ్యులు, విభాగాధిపతులు, పరిపాలనా అధికారులు పాల్గొన్నారు.

ఎం.ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటి,మహబూబ్ నగర్.