కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆర్థిక భరోసా.
లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి.
కోదాడ (మేజర్ న్యూస్)పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు.
శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 219 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారకుండా ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోదాడ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లీశ్వరి ,సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.