BREAKING
నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు రక్తదాన శిబిరానికి విశేష స్పందన టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు మెడ నొప్పి నుంచి చేతివేళ్ల తిమ్మిర్ల వరకు.. సర్వైకల్ సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండిలా పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం రాజయోగి డా.చిక్కా దేవదాసు ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ బృందం పర్యటన

ధరల మంటలో చిద్రమవుతున్న పేదోడి బతుకులు

Select Suryaa Now
ధరల మంటలో చిద్రమవుతున్న పేదోడి బతుకులు

(ధరల మంటలో చిద్రమవుతున్న పేదోడి బతుకులు)

1. పెరుగుతువున్న్సై పెరుగుతువున్న్సై

2. అన్ని రకాల వస్తు ధరలు పెరిగి ఆకాశాన్నీ మినంటినాయో

3. నిత్యవసర వస్తు ధరలు నిలువున పెంచేసినారో

4. పెరుగుతున్న ధరల చూసి బెంబేలెత్తిపోతున్నరో

5. చమురు కంపెనీల యజమానులు నష్టాల సాకుచూపి

6. పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలు అమాంతం పెంచినారు

7. గ్యాస్ కొందామంటే - గుదిబండ ఐనదో

8. ధరల మంటలో పేదోడి కష్టాలు, కన్నీళ్ళు

9. కూరగాయల ధరలకు కొమ్ములొచ్చినాయి

10. అల్లామెల్లి గడ్డా - వొల్లంతా మంటను పుట్టించే

11. ఉల్లి గడ్డ ధర చూస్తే- ఉడికిపోతున్నది

12. తిన్నా కొన్నా - ఎక్కడ కొందామన్నా కొరివి ఐనదో

13. ఎల్సీనో పేరూజెప్పి - కృత్రిమ కొరతను తెచ్చినారో

గాళ్ళ 14. మధ్యతరగతి పేద ప్రజల రక్తం తాగుతున్న మాఫియా

15. చాలి చాలని వేతనాలు సతమతమవుతున్నరో

16. నెల జీతం రాకముందే అప్పులోళ్లు ఇంటికొచ్చిరి

17. వచ్చే ఇన్కం తక్కువయ్యి - ఔట్ గోయింగు ఎక్కువై

18. పల్లెములోని అన్నము ముద్ద- అతి భారమైనది.

19. కార్పోరేట్లకు వరాలు ఇచ్చి ప్రజలపైన భారం మోపిరి

20. ధర మీద ధరలు దూకుతు ఉన్నై జీత భత్యాలు వెక్కిరించే

21. మానవ జీవితం నేడు అత్యంత ఖరీదయ్యిందో

22. ఇంటి అద్దెలు స్కూలు ఫీజులు పెంచేసినారు

23. విద్యా, వైధ్యం నేడు కాసుల కక్కుర్తిలో నడిచే

24. పధకాల పేరిట ప్రజల్ని మభ్యపెట్టినారో

25. ఓట్ల కోసం సీట్ల కోసం దిగజారే రాజకీయ పార్టీలు

" 26. ఓటు బ్యాంకు రాజకీయం ఉన్నంత వరకు

27. ప్రజల భతుకులు మారవాయేనో

28. ధరల మంటలో కాలుతవున్న పేదోడి బతుకులు

29. ఆగ్రరాజ్యమైన అమెరికా కయ్యానికి కాలు దువ్వినాదో

30. అధర్మ యుద్దాలకు ఆజ్యం పోస్తు సామ్రాజ్యవాదం

31. యుద్ధంలో మరణించింది చిన్న పిల్లలు సామాన్యులే

32. యుద్ధం పేరిట అమెరికా ఆయుధ వ్యాపారానికి తెగబడిందో

భారతదేశంలో పెరుగుతున్న ధరలను నిరసిస్తు పాట

రచన: దామరపల్లి నర్సింహ్మ రెడ్డి, ఫోన్: 9581358696