BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ బృందం పర్యటన

Select Suryaa Now
ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ బృందం పర్యటన

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ కార్యక్రమంలో భాగంగా ఎస్వీయూ కొనసాగుతున్న పరిశోధనా కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు హైదరాబాద్ వర్సిటీకి చెందిన ఏఎన్ఆర్ఎఫ్ హబ్ బృందం వర్సిటీలో రెండు రోజుల పాటు పర్యటించింది. ఇందులో భాగంగా సెంట్రల్ ఫెసిలిటీ, అడ్వాన్స్డ్ సెల్ కల్చర్ ఫెసిలిటీ, మెకానికల్ ఇంజినీరింగ్ ప్రయోగశాల, కెమిస్ట్రీ ప్రయోగశాలలను సందర్శించి, పరిశోధనా మౌలిక వసతులు, ఆధునిక పరికరాలు, సాంకేతిక సదుపాయాలు వాటి వినియోగాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధనా బృందం సభ్యులు సాంకేతిక సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపి పరిశోధనల అమలవుతున్న తీరు, పురోగతి ఎదురవుతున్న సవాళ్లను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏఎన్ఆర్ఎఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బ్రహ్మానందం మానవతి, కో-ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రొఫేసర్ సిబా కె ఉద్గత, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సమ్రత్ ఎల్ సబత్, ఎస్వీయూ రెక్టార్ చండ్రాయుడు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ ఎం.బాలాజీ,  అధ్యాపకులు పాల్గొన్నారు.

 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్