BREAKING
నేటి పంచాంగం 8 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు –8 నవంబర్, 2026 జాతీయ చిత్రలేఖన పోటీకి నారాయణ విద్యార్థిని నివేదిక ఎంపిక కంకిపాడు జడ్పీటీసీ పూజితకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సత్కారం ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ను కలిసిన నూతన ఎంపీటీసీలు పేదల ముఖాల్లో చిరునవ్వులే నిజమైన ఆనందం : బొండా సిద్ధార్థ దక్షిణ భారత చెస్ టోర్నీకి కృష్ణా వర్సిటీ మహిళా జట్టు ఎంపిక కౌంటింగ్‌ను పర్యవేక్షించిన ఎన్నికల పరిశీలకుడు కౌంటింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ బాణసంచా దుకాణాల్లో భద్రతా చర్యలపై అవగాహన జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ మహిళా ఉద్యోగుల రక్షణకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా మహాలక్ష్మి యాగం అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు రావాలి

టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు

Select Suryaa Now
టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు

                                 కంటి గాయాలు, శ్వాసకోశ సమస్యలపై కామినేని వైద్యుల హెచ్చరిక

హైదరాబాద్, మేజర్ న్యూస్ ప్రతినిధి : దీపావళి వేళ బాణాసంచా కాల్చేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కంటి చూపు కోల్పోయే ప్రమాదంతో పాటు కాలిన గాయాలు, శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చని ఎల్‌బీనగర్ కామినేని ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా, సీఓపీడీ బాధితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ మాధురీ పాటిల్ మాట్లాడుతూ, టపాసుల నిప్పురవ్వలు, రసాయనాల వల్ల కార్నియా, రెటీనాకు తీవ్ర గాయాలై శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కంటికి గాయమైతే రుద్దకూడదని, గృహ వైద్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఇ. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, బాణాసంచా పొగలోని సూక్ష్మ ధూళి కణాలు ఆస్తమా, సీఓపీడీ బాధితుల్లో దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను పెంచుతాయని తెలిపారు. వీలైనంత వరకు పొగకు దూరంగా ఉండాలని, వైద్యులు సూచించిన ఇన్హేలర్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, చేతిలో పట్టుకుని బాణాసంచా పేల్చరాదని వైద్యులు సూచించారు. ఇళ్లు, వాహనాలు, ఇంధన పదార్థాలకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలని, ప్రథమ చికిత్స సామగ్రి, నీటిని సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.