వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు
విజయవాడ మేజర్ న్యూస్ : భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యాటక ప్యాకేజీలను నిర్వహిస్తున్నట్లు ఏపీటీడీసీ జనరల్ మేనేజర్ తోట వీర నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శనివారం విజయవాడ నుంచి వాడపల్లి యాత్ర అందుబాటులో ఉంటుందని, పెద్దలకు రూ.1,350, పిల్లలకు రూ.1,100 టికెట్ ధరగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కార్తీక మాసం సందర్భంగా అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం పంచారామ క్షేత్రాలను ఒకేరోజులో దర్శించుకునేలా నవంబర్ 16, 23, 30, డిసెంబర్ 7 తేదీల్లో 12 సీట్ల మినీ ఏసీ బస్సుల ద్వారా ప్రత్యేక యాత్రను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యాత్ర ఉదయం 6 గంటలకు విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న ఏపీటీడీసీ కేంద్ర రిజర్వేషన్ కార్యాలయం నుంచి ప్రారంభమవుతుందని, పెద్దలకు రూ.2,370, పిల్లలకు రూ.1,920 టికెట్ ధరగా నిర్ణయించినట్లు వివరించారు. భక్తులు, పర్యాటకులు tourism.gov.in, www.aptdc.gov.in వెబ్‌సైట్లతో పాటు 98480 07025, 84990 54422 ఫోన్ నంబర్లు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45454 ద్వారా సంప్రదించి ముందస్తుగా టికెట్లు రిజర్వు చేసుకోవాలని తోట వీర నారాయణ సూచించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.