రక్తదాన శిబిరానికి విశేష స్పందన
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :
శ్రీచైతన్య విద్యా సంస్థల ఛైర్ పర్సన్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి 77వ జన్మదిన సందర్భంగా తిరుపతిలోని శ్రీచైతన్య విద్యాసంస్థలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రక్తదాన శిభిరానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా విద్యా సంస్థల ఏజీఎంలు ప్రసాద్, సురేష్ మాట్లాడుతూ ఝాన్సీలక్ష్మీబాయి సామాజిక, ఆధ్యాత్మిక సేవలు చిరస్మరనీయమని కొనియాడారు.ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏజీఎం బీవీ ప్రసాద్, స్కూల్స్ ఏజీఎం సురేష్, డీన్లు, ప్రిన్సిపాళ్లు, బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్