BREAKING
గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు రక్తదాన శిబిరానికి విశేష స్పందన టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు మెడ నొప్పి నుంచి చేతివేళ్ల తిమ్మిర్ల వరకు.. సర్వైకల్ సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండిలా పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం రాజయోగి డా.చిక్కా దేవదాసు ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ బృందం పర్యటన అవిన్య వేడుకల్లో విద్యార్థుల వినూత్న ఆలోచనలు - కళాత్మక ప్రతిభను చాటిన కేఎల్‌హెచ్

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేక భద్రత!

Select Suryaa Now
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేక భద్రత!



అరకులోయ, నవంబర్ 6, మేజర్ న్యూస్:బ్యాలెట్ బాక్స్ లున్న స్ట్రాంగ్ రూమ్స్ లో ఎన్నికల అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్స్ లో ప్రత్యేక పోలీసులు బలగాలు ఉంటాయి.ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద రక్షణ వ్యవస్థను అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఈనెల 7వ తేదీ శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు బ్యాలెట్ బాక్సులకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా కట్టుదిట్టమైన మూడు అంచెల భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.బ్యాలెట్ బాక్స్ ల భద్రత కోసం శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా స్థానిక పోలీసులతో పాటు సాయుధ బలగాలను రంగంలోకి దించారు. ఇక్కడి స్ట్రాంగ్ రూమ్స్ భద్రతను ఎన్నికల అధికారులు,పోలీసు ఉన్నతాధికారులు మూడు వలయాలుగా విభజించారు.మొదటి వలయంలో సాయుధ పోలీసు బలగాలు క్షేత్రస్థాయిలో నిరంతరం కాపలా కాస్తుండగా,రెండో వలయంలో స్పెషల్ పార్టీ పోలీసులు,మూడో వలయంలో స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు 24 గంటల పాటు షిఫ్టుల వారీగా విధులను నిర్వహిస్తున్నారు.కళాశాల  లోపలికి ముందస్తు అనుమతి ఉన్న అధికారులకు తప్ప ఎవరినీ అనుమతించడం లేదు. 
స్ట్రాంగ్ రూమ్స్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద కదలికలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ప్రతి కదలికను రికార్డు చేస్తూ, కళాశాల ఆవరణలో  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.ప్రధాన ద్వారాలకు ప్రత్యేక సీళ్లు  వేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే భద్రతా ప్రమాణాలను పూర్తి చేశారు.ఉన్నత పోలీస్ అధికారులు,రెవెన్యూ విభాగం అధికారులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్లోని స్ట్రాంగ్ రూమ్స్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అదేవిధంగా డ్యూటీలో ఉన్న సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు పలు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల అధికారులు, పోలీసులు హెచ్చరించారు. కాగా!మండలంలో ఈనెల 5వ తేదీ గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఈనెల 7వ తేదీ శనివారం నిర్వహించనున్నారు. మండల పరిధిలోని 14 గ్రామపంచాయతీలకు చెందిన 16 ఎంపీటీసీ,ఒక జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల లెక్కింపును స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల్లో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.అల్లూరి సీతారామరాజు జిల్లా ఎన్నికల పరిశీలకులు కూర్మనాద్,మండల ఎన్నికల అధికారులు ఏం. శ్రీధర్,వీసం.ప్రసాద్,జి. రాజా శ్రీధర్ పర్యవేక్షణలో కౌంటింగ్ ను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలను అధికారులు చేపట్టారు.ఓట్ల లెక్కింపును సజావుగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం జరగనుండగా కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల అధికారులు,పోలీసుల అనుమతితో శుక్రవారం ఏజెంట్ల నియామకాలను చేపట్టారు.