వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోటీలు
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : యువజన సర్వీసులు, క్రీడా మంత్రిత్వశాఖ, మై భారత్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ -2027 వక్తృత్వ పోటీలు, ఒన్ నేషన్ ఒన్ ఎలెక్షన్ అను అంశంపై స్థానిక ఎస్ఐసీ రోడ్డులోని ఎమరాల్డ్స్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ పోటీలకు ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంకటరాముడు, తిరుపతి జిల్లా యూత్ ఆఫీసర్ శశికుమార్ రెడ్డి, సెట్విన్ మేనేజర్ మోహన్, ఎమరాల్డ్స్ ఉపసంచాలకులు మునిరత్నం, మైభారత్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొని పోటీలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో యువతీ, యువకులు ఇలాంటి పోటీలలో పాల్గొని మంచి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని దేశ సమగ్రతకి తోడ్పాటును అందించినప్పుడే భారతదేశం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందన్నారు. ఈ పోటీలు తిరుపతి జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 150 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. ఇందులో విద్యార్థులు యోగవిజ్ఞరాజ్ ప్రథమ స్థానం, రాజ్వీ ద్వితీయ స్థానం, జాహ్నవి తృతీస్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలకు భానుకిరణ్, జగన్ మోహన్, భానుశ్రీ, హర్షవర్థినిలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్