మహిళా వర్సిటీలో ఈ వ్యర్ధాలు సేకరణ
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :పద్మావతి మహిళా వర్సిటీలోని ఎన్ఎస్ఎస్ యూనిట్లు -3,11 ఆధ్వర్యంలో మిషన్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ఈ వ్యర్ధాలు సేకరించారు. శుక్రవారం కళాశాల జరిగిన కార్యక్రమంలోఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఫిజికల్ ఎడ్యుకేషన్, ఐక్యూఏసీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల నుంచి పాత ఎలక్ట్రానిక్ పరికరాలు, వైర్లు, ఇతర ఈ-వ్యర్థాలను సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి కలిగే హానిని, వాటిని శాస్త్రీయ పద్ధతిలో రీసైక్లింగ్ చేయాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం మిషన్ లైఫ్ నోడల్ అధికారి & ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత కుమారి, కార్యక్రమ అధికారులు డాక్టర్ సునీత, డాక్టర్ ముత్తులక్ష్మి విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ-వ్యర్థాలను తగ్గించి పచ్చని పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్