దుర్గి : బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి - దుర్గి ఎస్ఐ బి.గోపాల్
దుర్గి మండల ప్రజలందరికీ దుర్గి ఎస్ఐ బి.గోపాల్ ముందస్తు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ దీపావళి పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.బాణసంచా విక్రయదారులు సంబంధిత శాఖల అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందిన తర్వాతే దుకాణాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద అగ్నిప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా అక్రమంగా బాణసంచా దుకాణాలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, పండుగ వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని ఎస్ఐ బి.గోపాల్ కోరారు.
పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి