BREAKING
రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు

దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.

Select Suryaa Now
దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. :  జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.
 
 
 సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
 
చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఆశలు, ఆనందాలు, సానుకూల ఆలోచనలు నింపాలని ఆకాంక్షించారు.
 
దీపావళి పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం, ప్రేమానురాగాలను పెంపొందించాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరారు. పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, బాణసంచా కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా భద్రతా నియమాలను అనుసరించాలని ప్రజలకు సూచించారు.
 
ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అభివృద్ధి, శ్రేయస్సును అందించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.