ప్రతి గడపనా ఆనంద దీపాలు వెలగాలి!
*చౌటుప్పల్, మేజర్ న్యూస్:* దీపావళి పండుగను పురస్కరించుకుని పెద్దకొండూరు బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు కాసుల శ్రీకాంత్ గౌడ్ గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఇంటా ఆనందాల కాంతులు విరజిమ్మాలని కోరారు.