దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర ప్రజలకు, వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. దీపావళి కాంతులు ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, ప్రజల జీవితాలు ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పండుగ వేళ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ కాలుష్యానికి తావులేకుండా, ప్రమాదాలు జరగకుండా టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. చిన్నారులు, పెద్దలు అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాల మధ్య దీపావళి పండుగను జరుపుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు.