కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు
కార్యక్రమానికి హాజరుకానున్న జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య
మొయినాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 8):
మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నివాసాల వద్ద దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని, వారితో పండుగ ఆనందాన్ని పంచుకోనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద కుటుంబాలకు చేరువ కావడం, వారి సొంతింటి కల సాకారం కావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలవనుంది.
జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో గ్రామంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.