BREAKING
రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు

అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు

Select Suryaa Now
అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు

మహిళా శక్తి భవనం శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.. రుద్రారం సర్పంచ్ యాదిరెడ్డి

షాబాద్, మేజర్ న్యూస్ (నవంబర్ 08)

గ్రామ అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదని రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి హెచ్చరించారు. గ్రామంలో మహిళా శక్తి భవనం శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద లీడర్లు, మండలానికి చెందిన నాయకులు ఉన్నారని సర్పంచ్ ఆరోపించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేరుగా తనతో మాట్లాడాలని, ఏమీ తెలియని యువకులు బండ అజయ్, బండి దయాకర్, అల్లాడ భరత్ లను రెచ్చగొట్టి వారితో శిలాఫలకాలను ఎత్తుకెళ్లేలా చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.శిలాఫలకంలో పేరు లేదనే కారణంతో మాచన్‌పల్లిలో సైతం డీఈతో వాగ్వాదానికి దిగారని తెలిపారు.  మా పేర్లు ఎందుకు రాయడం లేదని మాచన్పల్లిలో నాతో సైతం గొడవకు దిగారని సర్పంచ్ యాదిరెడ్డి తెలిపారు. అసలు ఏ ప్రోటోకాల్ ప్రకారం నామినేటెడ్ పదవులు పొందిన నాయకుల పేర్లను శిలాఫలకంలో పొందుపరచాలని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారమే సంబంధిత అధికారులు శిలాఫలకాల్లో పేర్లు పొందుపరుస్తారని స్పష్టం చేశారు.రాజకీయ విభేదాలను గ్రామ అభివృద్ధికి అడ్డంకిగా మార్చుకోవద్దని, శిలాఫలకం ధ్వంసం ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ యాదిరెడ్డి డిమాండ్ చేశారు.