BREAKING
చిల్లమూరుకు ఎంపీపీ పీఠం..?* మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..! మూడు దశాబ్దాల క్రితం నాటి రాజకీయ పరిణామం పునరావృతం.. 1995లో ఈశ్వరవాకకు.. ఇప్పుడు చిల్లమూరుకు మండల పరిషత్ అధ్యక్ష పదవి ఆర్థిటి హాస్పిటల్ విషాదం.. ఉరి వేసుకుని స్టాఫ్ నర్స్ ఆత్మహత్య. రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు

మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

Select Suryaa Now
మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం

 

 

మదనపల్లె,మేజర్ న్యూస్ : ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించిన అన్నమయ్య జిల్లా మదనపల్లి జడ్పిటిసి స్థానాన్ని వైకాపా కైవసం చేసుకుంది.వైఎస్సార్‌సీపీ,జనసేన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగిన హోరాహోరీ పోరులో చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జన్నే కిరణ్మయి విజయం సాధించారు.జనసేన అభ్యర్థి కొప్పుల రమ్య గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 1,326 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.రౌండ్ల వారీగా ఆధిక్యాలు మారుతూ సాగిన ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంటకు ముగియడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకిత్తించింది.అధికారులు తుది ఫలితాన్ని ప్రకటించగానే వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఆధిక్యం మారుతూ - ఉత్కంఠంతభరితంగా సాగుతూ

కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇరుపార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది.ప్రతి రౌండ్‌లోనూ ఫలితంపై ఉత్కంఠ కొనసాగింది.నాలుగో రౌండ్ ముగిసే సమయానికి జన్నే కిరణ్మయి 20,376 ఓట్లు సాధించి,జనసేన అభ్యర్థి కొప్పుల రమ్యకు వచ్చిన 19,870 ఓట్లపై 506 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.అనంతరం మిగిలిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఈ ఆధిక్యం 1,326 ఓట్లకు చేరింది.దీంతో కిరణ్మయి విజయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించారు.


వైఎస్సార్సీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం

మదనపల్లె జెడ్పీటీసీ స్థానంలో జనసేన అభ్యర్థి చివరి వరకు పోటీ ఇవ్వడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకతగా నిలిచింది.విజయం కోసం ఇరు పార్టీల శ్రేణులు చివరి వరకు ఉత్కంఠతో ఎదురుచూశాయి.తుది ఫలితం వెలువడిన అనంతరం వైఎస్సార్‌సీపీ నాయకులు,కార్యకర్తలు కిరణ్మయికి అభినందనలు తెలిపారు.పూలమాలలు వేసి విజయోత్సవాలు నిర్వహించారు.ఈ గెలుపు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.ఇదిలా ఉండగా జెడ్పిటిసిగా విజయం సాధించిన జన్నే కిరణ్మయి,ఆమె భర్త స్టేట్ బీసీ కమిషన్ సభ్యులు జన్నే శేషాచలపతి నాయుడుకి వైఎస్సార్సిపి నాయకులు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి