చిల్లమూరుకు ఎంపీపీ పీఠం..?* మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..! మూడు దశాబ్దాల క్రితం నాటి రాజకీయ పరిణామం పునరావృతం.. 1995లో ఈశ్వరవాకకు.. ఇప్పుడు చిల్లమూరుకు మండల పరిషత్ అధ్యక్ష పదవి
చిట్టమూరు మేజర్ న్యూస్
చిట్టమూరు మండల పరిషత్ రాజకీయాల్లో ఈసారి చిల్లమూరు సెగ్మెంట్ ప్రత్యేక చర్చకు కేంద్రబిందువుగా మారింది.ఎంపీపీ స్థానం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ కావడం, మల్లాం-2 ఎస్టీ జనరల్, యాకసిరి ఎస్టీ మహిళ స్థానాలుగా కేటాయించడంతో ఈ రెండు రిజర్వ్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.అయితే జనరల్ స్థానమైన చిల్లమూరు నుంచి కూటమి తరఫున బరిలోకి దిగిన ఎస్టీ అభ్యర్థి 396 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం రాజకీయంగా కీలక పరిణామంగా నిలిచింది. మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కూటమి 8 స్థానాలను, వైఎస్సార్‌సీపీ 4 స్థానాలను కైవసం చేసుకోవడంతో మండల పరిషత్‌పై కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించింది.ఈ సంఖ్యాబలం నేపథ్యంలో ఎంపీపీ పీఠం కూటమికి దక్కనుండగా, ఎంపీపీ పదవిని చిల్లమూరు సెగ్మెంట్‌కు చెందిన అభ్యర్థి చేపట్టే అవకాశం ఏర్పడటం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. చిల్లమూరు సెగ్మెంట్‌కు ఎంపీపీ పీఠం దక్కడం ఆ ప్రాంత తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యతను తీసుకొచ్చే పరిణామంగా భావిస్తున్నారు.ఇప్పటివరకు మండల రాజకీయాల్లో తమదైన పాత్ర పోషిస్తున్న చిల్లమూరు,మొలకలపూడి ప్రాంత నాయకత్వానికి ఇప్పుడు మండల పరిషత్ అధ్యక్ష పదవి ద్వారా మరింత విస్తృతమైన గుర్తింపు, రాజకీయ వేదిక లభించే అవకాశం ఏర్పడింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో స్థానిక నాయకత్వం ప్రధాన భూమిక పోషించేందుకు ఈ పరిణామం దోహదపడుతుందని చర్చనీయాంశమైంది.ఈ పరిణామానికి గత రాజకీయ చరిత్రలోనూ ఆసక్తికరమైన పోలిక ఉంది.1995 సాధారణ ఎన్నికల సమయంలో చిట్టమూరు మండలంలో ఎంపీపీ స్థానం జనరల్‌కు కేటాయించబడింది.అప్పట్లో ఆరూరు జనరల్ ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నల్లారెడ్డి దశరథ రామిరెడ్డి ఓటమిపాలయ్యారు.అదే సమయంలో ఈశ్వరవాక సెగ్మెంట్ నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉద్దూరు రాజగోపాలు ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు.దీంతో ఆయనకు ఎంపీపీ పదవి వరించి మండల పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.జనరల్‌కు రిజర్వ్ అయిన ఎంపీపీ పదవిని ఈశ్వరవాక సెగ్మెంట్‌కు చెందిన ఎస్సీ సామాజిక వర్గ నాయకుడు చేపట్టడం అప్పటి రాజకీయాలలో
ప్రత్యేక సంతరించుకుంది. ప్రస్తుతం మూడు దశాబ్దాల అనంతరం అలాంటి తరహా రాజకీయ పరిణామమే మరోసారి చర్చకు వస్తోంది. అప్పట్లో జనరల్ ఎంపీపీ స్థానం ద్వారా ఈశ్వరవాక సెగ్మెంట్‌కు చెందిన ఎస్సీ నాయకుడికి అధ్యక్ష పదవి దక్కగా,ఇప్పుడు ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఎంపీపీ స్థానం నేపథ్యంలో జనరల్ సెగ్మెంట్ అయిన చిల్లమూరు నుంచి ఎస్టీ అభ్యర్థి విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఏర్పడింది.అయితే అప్పటి ఎంపీపీ రిజర్వేషన్ జనరల్ కాగా,ప్రస్తుతం ఎస్టీ జనరల్ కావడం గమనార్హం.రెండు సందర్భాల్లోనూ జనరల్ ఎంపీటీసీ సెగ్మెంట్‌కు చెందిన సామాజిక వర్గ నాయకత్వం మండల పరిషత్ అధ్యక్ష పదవిని చేపట్టే పరిస్థితి రావడం రాజకీయంగా ఆసక్తికరమైన పోలికగా నిలుస్తోంది.ఎంపీపీ పదవి ద్వారా చిల్లమూరు ప్రాంతానికి చెందిన నాయకులకు మండల స్థాయిలో నిర్ణయాత్మక బాధ్యతలు చేపట్టే అవకాశం లభించనుంది.దీంతో ఈ ప్రాంతంలో రాజకీయ నాయకత్వం మరింత బలోపేతం కావడంతో పాటు, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చిల్లమూరు మరింత బలమైన,కీలక రాజకీయ కేంద్రంగా ఎదిగే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికంగా పార్టీ శ్రేణుల్లోనూ ఈ పరిణామం కొత్త ఉత్సాహాన్ని నింపే అంశంగా మారింది. ఎంపీపీ పదవితో చిల్లమూరు నాయకత్వానికి మండల స్థాయిలో గుర్తింపు పెరగడంతో పాటు,భవిష్యత్తు రాజకీయాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.మరోవైపు రిజర్వ్ స్థానాలైన మల్లాం-2, యాకసిరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ,మొత్తం స్థానాల్లో కూటమి సాధించిన స్పష్టమైన మెజారిటీతో చిల్లమూరు నాయకత్వానికి మండల స్థాయిలో ప్రాతినిధ్యం దక్కే పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో కొత్తగా ఎంపీపీ బాధ్యతలు చేపట్టే వారు అన్ని సెగ్మెంట్లను సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తారన్నది కూడా కీలకంగా మారనుంది.మొత్తంగా చిట్టమూరు మండల పరిషత్ ఎన్నికల్లో కూటమికి లభించిన స్పష్టమైన మెజారిటీ ఒకవైపు, జనరల్ సెగ్మెంట్ అయిన చిల్లమూరు నుంచి ఎస్టీ అభ్యర్థి విజయం సాధించి ఎంపీపీ పీఠాన్ని అధిరోహించే అవకాశం మరోవైపు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 1995లో ఈశ్వరవాక సెగ్మెంట్‌కు చెందిన ఉద్దూరు రాజగోపాలు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన రాజకీయ చరిత్రను గుర్తుచేస్తూ,ఇప్పుడు చిల్లమూరుకు అదే తరహాలో మండల పరిషత్ అధ్యక్ష పదవి దక్కనుండటం స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.మూడు దశాబ్దాల క్రితం ఈశ్వరవాకకు దక్కిన మండల నాయకత్వ అవకాశం..ఇప్పుడు చిల్లమూరును వరించనుండటంతో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాల్లో ఈ ప్రాంతం ఎలాంటి పాత్ర పోషించబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
అంపల్లి మురళి చిట్టమూరు మేజర్ న్యూస్