BREAKING
ఓటు హక్కు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి సిండికేట్ అయ్యారా..? అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..!? ఎల్‌నినో ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వికారాబాద్ డెవలప్‌మెంట్ ఫోరం పోలీసు ఆదేశాలు బేఖాతరు..లక్ష్మీనగరంలో అక్రమ టపాసుల జోరు.విచారించి చర్యలు తీసుకుంటాం.సీఐ వెంకటప్పయ్య. దీపావళి వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.. సురక్షితంగా పండుగ జరుపుకోవాలి: ఎస్పీ స్నేహ మెహ్రా నిరుపేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు సిద్దిపేట రూరల్ మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఎన్నిక చిల్లమూరుకు ఎంపీపీ పీఠం..?* మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..! మూడు దశాబ్దాల క్రితం నాటి రాజకీయ పరిణామం పునరావృతం.. 1995లో ఈశ్వరవాకకు.. ఇప్పుడు చిల్లమూరుకు మండల పరిషత్ అధ్యక్ష పదవి ఆర్థిటి హాస్పిటల్ విషాదం.. ఉరి వేసుకుని స్టాఫ్ నర్స్ ఆత్మహత్య. రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! కొడంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి 2 వ రోజు పర్యటన.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు రామగిరి లో బైనేని శిరీషకు చారిత్రాత్మక విజయం!! మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్

పోలీసు ఆదేశాలు బేఖాతరు..లక్ష్మీనగరంలో అక్రమ టపాసుల జోరు.విచారించి చర్యలు తీసుకుంటాం.సీఐ వెంకటప్పయ్య.

Select Suryaa Now
పోలీసు ఆదేశాలు బేఖాతరు..లక్ష్మీనగరంలో అక్రమ టపాసుల జోరు.విచారించి చర్యలు తీసుకుంటాం.సీఐ వెంకటప్పయ్య.

పోలీసు ఆదేశాలు బేఖాతరు..లక్ష్మీనగరంలో అక్రమ టపాసుల జోరు.

* అనుమతులు లేకుండా.. జన సమూహం నడుమే అమ్మకాలు.

* విచారించి చర్యలు తీసుకుంటాం.సీఐ వెంకటప్పయ్య.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::

పండుగ వేళ ఆనందాలు పంచాల్సిన దీపావళి దమ్ముగూడెం మండల ప్రజలకు మాత్రం ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. మండలంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన లక్ష్మీనగరం ప్రధాన సెంటర్‌లో అనుమతులు లేకుండా  టపాసుల వ్యాపారం నిర్వహిస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.దీపావళి బాణసంచా అమ్మకాలు జరపాలంటే ఖచ్చితంగా పోలీసు,ఫైర్ సేఫ్టీ అనుమతులు, జనావాసాలకు,రద్దీ ప్రాంతాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేయాలని అధికారులు ఒకపక్క స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. కానీ లక్ష్మీనగరం సెంటర్‌లోని వ్యాపారులు అధికారుల ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా నిబంధనలను నట్టేట ముంచుతూ అక్రమ విక్రయాలకు కొనసాగిస్తున్నారు.ప్రధాన రహదారి పక్కన ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా నిత్యం వందలాది మంది ప్రయాణికులు,వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై భారీ మొత్తంలో బాణసంచా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు.ఏ చిన్న అజాగ్రత్త జరిగి నిప్పు రవ్వ పడినా..క్షణాల వ్యవధిలో పెను అగ్నిప్రమాదం సంభవించే ముప్పు పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, అనుమతులు లేని ఈ అక్రమ బాణసంచా దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఈ అనుమతుల విషయ దుమ్ముగూడెం సిఐ వెంకటప్పయ్య వివరణ కోరగా.. లక్ష్మీనగరంలో ఏర్పాటుచేసిన బాణసంచా విక్రయాలపై ఎటువంటి అనుమతులు పోలీస్ శాఖ నుంచి తీసుకోలేదని తెలిపారు విచారించి చర్యలు తీసుకుంటామని సి ఐ తెలిపారు.