BREAKING
సైబర్‌ట్రక్ ఉత్పత్తిపై టెస్లా కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం: 564 స్థానాల్లో ఘనవిజయం బినాన్స్ సీఎఫ్‌ఓ కైజర్ ఎన్జీ రాజీనామా డిసెంబర్‌లో విడుదల కానున్న అస్టెల్లాస్ ఫార్మా ఉద్యోగి వాషింగ్టన్ డీసీ గోల్ఫ్ ప్రాజెక్ట్ వివాదం.. ప్రత్యేక మాస్టర్‌గా జెస్సీ లూ నియామకం జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం: 22 మందికి గాయాలు శత వసంతంలోకి అడుగుపెడుతున్న భారతరత్న ఎల్‌కే అడ్వాణీ మహారాష్ట్రలో దారుణం: బీడ్ జిల్లాలో పులి దాడికి వ్యక్తి బలి కొల్లూరులో రూ. 90 కోట్ల భూ కుంభకోణం: నలుగురిని అరెస్ట్ చేసిన సీఐడీ పూజారిపై తీవ్ర పదజాలాంతో దాడి సీఎం సభ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి: ఎస్పీ స్నేహ మెహ్రా ఓటు హక్కు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి సిండికేట్ అయ్యారా..? అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..!? ఎల్‌నినో ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన వికారాబాద్ డెవలప్‌మెంట్ ఫోరం పోలీసు ఆదేశాలు బేఖాతరు..లక్ష్మీనగరంలో అక్రమ టపాసుల జోరు.విచారించి చర్యలు తీసుకుంటాం.సీఐ వెంకటప్పయ్య.

ఓటు హక్కు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

Select Suryaa Now
ఓటు హక్కు పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

 

 

 

 

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా డిక్కీ కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్ అధ్యక్షతన నిర్వహించే ప్రతి ఆదివారం అంబెడ్కర్ స్మరణం కార్యక్రమానికి ఈ వారం ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ దుమాల రాజ్ కుమార్ హాజరై అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు దాని పరిరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్, గొడిసెల అశోక్ రాజు, బొల్లారపు శ్రీధర్, పట్టణ రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం ప్రధాన కార్యదర్శి కంటే అంజయ్య, దళిత క్రిస్టియన్ జిల్లా అధ్యక్షులు ముద్దమల్ల ప్రవీణ్ కుమార్, తన్నీరు నారాయణ, దాసరి లచ్చయ్య, దాసరి ప్రవీణ్, రుద్ర మనోహర్, సుంకర పెళ్లి అశోక్ పాల్గొన్నారు.