వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం
వత్సవాయి మండలంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. మండలంలోని మొత్తం 18 ఎంపీటీసీ సెగ్మెంట్లకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 11 స్థానాలను కైవసం చేసుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. మక్కపేటలో బీఎస్వై, పోలంపల్లిలో సీపీఐ, కూటమి అభ్యర్థులు విజయం సాధించినట్లు ఫలితాల జాబితాలో వెల్లడైంది.
మరోవైపు వత్సవాయి జడ్పీటీసీ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వడ్లమూడి రాంబాబు 2,800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
గ్రామాల వారీగా ఎంపీటీసీ విజేతల వివరాలు:
1. వత్సవాయి-1 – టీడీపీ
2. వత్సవాయి-2 – టీడీపీ
3. వత్సవాయి-3 – టీడీపీ
4. భీమవరం-1 – వైఎస్సార్సీపీ
5. భీమవరం-2 – టీడీపీ
6. కాకరవాయి – టీడీపీ
7. కంభంపాడు – వైఎస్సార్సీపీ
8. వేమవరం – వైఎస్సార్సీపీ
9. లింగాల – టీడీపీ
10. మందినేనిపాలెం – వైఎస్సార్సీపీ
11. కన్నెవీడు – టీడీపీ
12. ఇంద్రుపల్లి – టీడీపీ
13. డబ్బాకుపల్లి – టీడీపీ
14. మక్కపేట – బీఎస్వై
15. పోలంపల్లి – సీపీఐ, కూటమి
16. మంగొల్లు – టీడీపీ
17. గొప్పిసెట్టిపాలెం – టీడీపీ
18. చిట్యాల – వైఎస్సార్సీపీ
మొత్తంగా వత్సవాయి మండలంలో టీడీపీ అత్యధిక ఎంపీటీసీ స్థానాలను సాధించడంతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ఎన్నికల ఫలితాలతో మండల రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.