BREAKING
మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం

Select Suryaa Now
కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మండలం,కొత్తిండ్లు -1 ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.శనివారం ఆదిత్య కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపులో వైకాపా అభ్యర్థి హబీబ్ ఉత్కంఠ విజయం సాధించారు.ఈ సందర్భంగా హబీబ్ మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమమే వైఎస్ఆర్సిపి నినాదమన్నారు.గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.ప్రజల ఆశీర్వాదంతో కొత్తిండ్లు -1లో విజయం సాధించడం ఆనందంగా ఉందని,పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు.అనంతరం వైకాపా యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ ఇర్ఫాన్ మాట్లాడుతూ నాటి జగనన్న ప్రజారంజక పాలన ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు.నాడు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం జరిగిందన్నారు.కొత్తిండ్లు -1లో వైకాపా అభ్యర్థిని గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు.అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి,వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,నియోజకవర్గం పరిశీలకులు అనూషా రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి