BREAKING
మదనపల్లె జెడ్పీటీసీగా వైకాపా అభ్యర్థిని జన్నే కిరణ్మయి ఘనవిజయం : ఆధిక్యం మారుతూ సాగిన కౌంటింగ్‌తో ఉత్కంఠ : వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

Select Suryaa Now
Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

Weekly Horoscope (Rasi Phalalu) 01.11.2026 నుండీ 07.11.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

మేషరాశి...

ప్రారంభంలో వ్యాపార వ్యవహారాలలో మిత్రులతో, భాగస్వాములతో కమ్యూనికేషన్, సృజనాత్మకత విషయాలలో పరిశీలన అవసరం. స్త్రీలతో వాదనలకు  తావివ్వరాదు. సంతానవర్గంతో, ముఖ్య చర్చలలో ఆత్మస్థైర్యం, ప్రశాంతత ముఖ్యం. ఖర్చులు అధికం. వారం మధ్యలో వాహన, స్థిరాస్తి సంబంధ అంశాలు, విద్యా విషయాలలో ఆకస్మిక మార్పులు, నిర్ణయాలలో ఉద్వేగాలు. గృహ ప్రశాంతత తక్కువ. తల్లి ఆరోగ్య శ్రద్ధ. ఆహార స్వీకరణలో తగు జాగ్రత్తలతో వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. వారాంతం దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య కీలక మార్పులు. విద్యార్థులు ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. మానసిక చికాకులు అధిగ మించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు 

వృషభరాశి… 

ప్రారంభంలో కృషితో అనుకున్న పనులు సాధిస్తారు, సామర్థ్యం, ఆరోగ్యం కొంత అనుకూలం. బంధుమిత్రులతో చర్చలు. సంతాన అభివృద్ధిలో ప్రత్యేక దృష్టి. ఆర్థిక, నెట్వర్క్ విషయాలలో, దీర్ఘకాలిక పెట్టుబడుల అంశాలు ఆచితూచి వ్యవహరించాలి. మధ్యలో భూ, స్థిరాస్తి అంశాలలో, రుణాలలో తగిన జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్య వ్యవహారాలలో, నిర్ణయాలలో ప్రశాంతత ముఖ్యం. సంఘంలో గుర్తింపు గౌరవం, భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. వారాంతం స్థిరాస్తి విషయాలలో వేగంగా నూతన పెట్టుబడులలో, ఆర్థిక అభివృద్ధికై ఆకస్మిక నిర్ణయాలలో ఆత్మీయులను సంప్రదించటం మేలు. తల్లి ఆరోగ్యశ్రద్ధ, గృహ ప్రశాంతత పై దృష్టి సారిస్తారు. శ్రీ దత్త శరణంమమ మేలు.

మిధున రాశి… 

వారం ప్రారంభంలో వ్యక్తిగత పెట్టుబడులు, సృజనాత్మక ఆలోచనలు, అధిక శ్రద్ధ. కుటుంబము, ముఖ్యంగా సంతానముతో, ప్రియమైన వ్యక్తులతో కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలు అవసరం. సహకారం సామాన్యం. గృహ, వాహన సంబంధ విషయాలలో అసంతృప్తి. మాటల వల్ల, రావలసిన ఆర్థిక అంశాలలో ప్రశాంతత తక్కువ. వారం మధ్యలో పోటీలు, రుణ, న్యాయ, సంబంధ అంశాలలో, శ్రమ అధికం. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ అవసరం. రొటీన్ ని సరిచూసుకోవాలి. వారాంతం సాంఘిక సంబంధాలు, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో శ్రద్ధ. వ్యక్తుల సహకారం, కమ్యూనికేషన్ ఘర్షణలు లేకుండా సద్వినియోగ పరుచుకోవాలి. దగ్గర ప్రయాణాలకు అవకాశం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు.

కర్కాటక రాశి...

ప్రారంభంలో ఆర్థిక విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో మానసిక ప్రశాంతత పెంపొందిం చుకోవాలి. స్థిరాస్తి అంశాలలో ఆగిన అభివృద్ధి, గృహసౌక్యం, తోబుట్టువులతో  చర్చలు  మిశ్రమ ఫలితాలు. అధిక ఉద్వేగాలని నియంత్రించుకోవాలి. వారం మధ్యలో సంతాన రీత్యా, వృత్తి పరమైన అంశాలలో ప్రణాళికలలో ఏర్పడుతున్న అవరోధాల్ని, అనవసర ఆందోళనలను, ఆలోచనలను సరిచూసుకుంటూ మీ వ్యక్తిగత ఆరోగ్యం, ఆత్మస్థైర్యం మీద తగిన శ్రద్ధ వహించాలి. వారాంతం శ్రమతో అనుకున్న పనులని సామర్థ్యంతో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు, మాటలలో, ఆర్థిక విషయాలలో వేగాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలం. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

సింహరాశి… 

వారం ప్రారంభంలో ఆత్మస్థైర్యంతో, అధిక శ్రమతో పనులు పూర్తి చేసే ప్రయత్నాలు, కుటుంబ ఆర్థిక వ్యవహారాలలో, వృత్తిలో కొలీగ్స్తో అవగాహన అవసరం. వృత్తిపరంగా శ్రమ, ఘర్షణలు అధిగమిస్తూ ప్రణాళికా పరంగా వెళ్లాలి. విద్యార్థులు స్క్రీన్ టైమ్ నియంత్రణ అవసరం. ముఖ్యంగా నిద్రలేమి సరి చూసుకుంటూ ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. వారం మధ్యలో స్థిరాస్తి, విద్యా, భూ అంశాలు, తల్లి ఆరోగ్య వ్యవహారాలలో దృష్టి సారిస్తారు. దీర్ఘకాలికి పెట్టుబడులలో ఆలోచనలు. గృహవాతావరణంలో ప్రశాంతత పెంపొందించు కోవాలి. వారాంతం సంతానవృద్ధి, ఆత్మీయుల కొరకు ఖర్చులు, నూతన పెట్టుబడుల చర్చలు. ప్రశాంత నిర్ణయాలు ముఖ్యం. హనుమాన్ చాలీసా మేలు చేస్తుంది.

కన్యా రాశి… 

ప్రారంభంలో ఆర్థిక, కుటుంబ విషయాలలో ఆత్మ విశ్వాసం అవసరం. గృహములో ఖర్చులు అధికం. కంటి ఆరోగ్య శ్రద్ధ అవసరం. మాటలవల్ల ఆత్మీయులతో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వారం మధ్యలో అధికశ్రమతో సామర్థ్యంతో పనులు పూర్తి. వ్యక్తుల సహకారం మిశ్రమం. రావలసిన లాభాలు, ఆకస్మిక విషయాలు  శ్రమానంతరం కొంతవరకు ఫలిస్తాయి. వారాంతం స్థిరాస్తి వ్యవహారాల మీద దృష్టి. ముఖ్యంగా గృహవాహన చిన్నపాటి రిపేర్లు. అనుకోని ఖర్చులు. విరాళాలపై దృష్టి. విదేశీ ప్రయాణాలపై ఆలోచనలు. భూమి, గృహ సంబంధ కొనుగోలులో చింతామణి గృహంతస్తా శ్రీమన్నగరనాయక శ్లోకము మేలు. పూర్వరుణాల, న్యాయ విషయాల ఆలోచనలు. దత్తాత్రేయుడి ఆరాధన మంచిది.

తులా రాశి… 

వారం ప్రారంభంలో వృత్తి ఆర్థిక వ్యవహారాలలో, ముఖ్యమైన నిర్ణయాలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. అధిక శ్రమతో ముందుకు వెళతారు. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, ముఖ్యంగా కంటి జాగ్రత్తలు అవసరం. మధ్యలో వృత్తి, వ్యాపార సంబంధ విషయాలలో భాగస్వామ్య వ్యవహారాలలో జీవిత భాగస్వామితో చర్చలలో, కుటుంబ ఆర్థిక అంశాలలో ముఖ్య సభ్యులతో మాటల్లో నిదానము, ప్రశాంతత అవసరం. భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ. వారాంతం, సామర్థ్యంతో అనుకున్న పనులు సాధిస్తారు, సజ్జన సహకారం, ఆగిన పనులు ముందుకు వెళతాయి. ఆర్థిక అనుకూలతలు. మాటవిలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకారం. ఆధ్యాత్మిక ఆశీస్సులు. సూర్యాష్టకం మేలు.

వృశ్చిక రాశి… 

వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో, వారసత్వ అంశాలలో, అధిక శ్రమ, నిద్రలేమి, ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. మీడియాలో నెట్వర్క్ పెంపొందించుకుంటారు, చిన్ననాటి మిత్రులతో చర్చలు చేస్తారు, ఆశించిన ఫలితాలు సామాన్యం. ఉన్నత అధికారులతో, సహకారం సామాన్యం. ఆకస్మిక ఘర్షణలకు దూరంగా ఉండాలి. మధ్యలో వృత్తి నిర్ణయాలలో ప్రశాంతత అవసరం, ఉద్వేగాలు అధిగమించాలి. మాటలలో, కమ్యూనికేషన్ లో జాగ్రత్తలతో ముందుకు వెళ్లాలి. వారాంతం ఆర్థిక విషయాలు అనుకూలం, మాటవిలువ, వృత్తి పరంగా అధిక బాధ్యతలు, శ్రమ, గౌరవం. ముఖ్యంగా వేగవంతమైన నిర్ణయాలు, మార్పులు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దుర్గాదేవి ఆరాధన మేలు.

ధను రాశి… 

ప్రారంభంలో  వృత్తి వ్యాపారాలలో, భాగస్వామ్య వ్యవహారాలలో ఆకస్మిక ఖర్చులు మార్పులు, ఉన్నప్పటికీ సద్వినియోగ పడతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి అధికారుల సహకారం అధిక శ్రమానంతరం లభ్యం. కమ్యూనికేషన్, సృజనాత్మకత ఉపయోగ పడుతుంది. వృత్తిపరంగా కొలీగ్స్, అధికారంలో ఉన్నస్త్రీలతో సమన్వయం ముఖ్యం. మధ్యలో వాహన, రుణ విషయాలలో ఆకస్మిక చికాకులు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు ఘర్షణ అధిగమించాలి. సంతానముతో, ప్రియమైన వ్యక్తులతో వాగ్వాదాలు లేకుండా ముందుకు వెళ్లాలి. వారాంతం గౌరవం పెరుగుతుంది. తండ్రి పెద్ద సహకారం అనుకూలం. ఆధ్యాత్మిక, దూరవిద్య, ప్రయాణ ఆలోచనలు. ఆదిత్య హృదయం మేలు.

మకర రాశి… 

ప్రారంభంలో వృత్తి వ్యాపార విషయాలలో శ్రమ అధికం, సహకారం సామాన్యం. కమ్యూనికేషన్ బాగున్న, చర్చల యందు పై అధికారులతో సమన్వయం ముఖ్యం. సంతాన అభివృద్ధి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. వారం మధ్యలో వ్యాపార , కుటుంబ స్త్రీల ఆరోగ్య విషయంలో శ్రద్ధ. స్థిరాస్తి వ్యవహారాలలో అధిక శ్రమ. సాంఘిక సంబంధాలలో అనవసర ఘర్షణలు అధిగమించాలి. వారాంతం ఆకస్మిక ఖర్చులు, పని ఒత్తిడి, నిద్రలేమి. ప్రశాంతత తక్కువ. కొలీగ్స్ తో, దూర ప్రదేశాలలో తోబుట్టువులతో చర్చలలో, ఆశించిన సహకారంలో జాగ్రత్తగా ఉద్వేగాలు అధిగమించాలి. భాగస్వామి కుటుంబ సభ్యుల ఆరోగ్య శ్రద్ధ. గణపతి, సుబ్రహ్మణ్య ఆరాధన అవసరం.

కుంభ రాశి… 

వారం ప్రారంభంలో నైపుణ్యాలు ఉన్నప్పటికీ వృత్తి, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధిలో అసంతృప్తి, పెద్దలతో మాట పట్టింపులు. ఆర్థిక విషయాల ఆకస్మిక వాయిదా. కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. స్థిరాస్తి విషయాలలో కొన్ని నిర్ణయాలు. వారం మధ్యలో వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమతో వ్యక్తుల సహకారం లభ్యం. కృషి శీలత పెంపొందించుకుంటారు. వారాంతం ఆశించిన విషయాలలో, ఆర్థికంగా అనుకూలతలు, వృత్తి వ్యాపారాలలో కొంతమేర అభివృద్ధి. సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ సాంఘిక సంబంధాల్లో, జీవిత భాగస్వామితో ఘర్షణ లేకుండా ముందుకు వెళ్లాలి. ఆధ్యాత్మిక వ్యక్తుల పరిచయాలు, వారి ఆశీస్సులు పొందుతారు. గణపతి, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, మందిరాలు దర్శించడం మేలు.

మీన రాశి… 

ప్రారంభంలో జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ, వ్యాపార విషయాలలో, ముఖ్య నిర్ణయాలలో ఆలస్యాలు ఆటంకాలు. మానసిక ప్రశాంతత తక్కువ. ఆత్మీయులతో చర్చలలో నిదానము ముఖ్యం. వారం మధ్యలో సంతాన వర్గంతో ఆత్మీయ వ్యక్తులతో కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో ఉద్వేగాలు, అసంతృప్తి అధిగమించాలి. సంతాన విషయాలలో శ్రద్ధ చూపిస్తారు. వారాంతం ఆలస్యం అవుతూ వస్తున్న ఎదురుచూసిన వృత్తి విషయాలలో కొంత అభివృద్ధి, తగిన గుర్తింపు, గౌరవం, అధిక శ్రమతో నైపుణ్యాలు పెంచుకుంటూ కృషిశీలతతో ముందుకు వెళతారు. న్యాయ, రుణ విషయాలలో దృష్టి సారిస్తారు. ఆరోగ్యం కొంత అనుకూలం. దత్తాత్రేయుని ఆరాధన, ఆలయ సందర్శన మేలు.

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com