మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మీన రాశి… వారం ప్రారంభంలో ఆత్మీయ వ్యక్తులతో, మీ ఆలోచనలలో ఘర్షణను, ఉద్వేగాలని నియంత్రించుకోవాలి. మానసిక ప్రశాంతత ముఖ్యం. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలలో, సంతాన వర్గంతో, తండ్రి తరపు బంధువులతో ముఖ్య చర్చలలో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారం మధ్యలో కృషితో, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ కొత్త నిర్ణయాలతో వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. సహకరించాల్సిన ఉన్నత స్థాయి, పలుకుబడి కలిగిన వ్యక్తులతో తగిన సమన్వయాన్ని పెంపొందించుకోవాలి. అనవసర విమర్శలకి అవకాశం ఇవ్వరాదు. వృత్తిలో గౌరవం విషయంలో ఆశించిన గుర్తింపు. వారం చివరిలో వృత్తిలో నూతన పరిచయాలు, కొత్త ఆలోచనలు. సృజనాత్మకత అనుకూలం. కుటుంబములో వృత్తిలో స్త్రీల సహకారం మిశ్రమం. వాదనలకు దూరంగా ఉండాలి. సుబ్రమణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.