పోలమాంబ ఆలయంలో అయ్యప్ప స్వాముల అన్నదానం
- శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి శబరి పీఠం
ఆరిలోవ, సూర్య: జీవీఎంసీ, 17వ వార్డు పరిధిలో గల సంజయ్ గాంధీ కాలనీ శ్రీ పోలమాంబ అమ్మవారి ఆలయ ఆవరణలో శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి శబరి పీఠం వద్ద తేదీ 4 న బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శబరి పీఠం ప్రతినిధులు సీతారాం, కోడి బోయిన అప్పలరాజు, బోనీ దిలీప్ కుమార్ తెలిపారు. స్వామిలందరూ స్వామివారి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.